Hyderabad | దొంగలు సాధారణంగా బంగారం, నగదు చోరీ చేస్తారు.. కానీ వీళ్లేం ఎత్తుకెళ్తారో తెలుసా?

Hyderabad | దొంగలు సాధారణంగా బంగారం, నగదు చోరీ చేస్తారు.. కానీ వీళ్లేం ఎత్తుకెళ్తారో తెలుసా?
Hyderabad | దొంగలు సాధారణంగా బంగారం, నగదు చోరీ చేస్తారు.. కానీ వీళ్లేం ఎత్తుకెళ్తారో తెలుసా?
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | దొంగతనం జరిగిదంటే బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్తారు. కానీ ఈ దొంగలు డిఫరెంట్​. ఇంట్లోకి చొరబడకుండానే చోరీలు చేస్తారు. అదేలా అనుకుంటున్నారా.. ఇంటి ముందు ఉన్న చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్తారు. హైదరాబాద్‌ – మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో బుధవారం రాత్రి చెప్పులు, బూట్ల దొంగలు హల్​చల్​ చేశారు.

మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్​మెంట్లలో చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లారు. ఆటోలో వచ్చి మరి చెప్పులను సంచుల్లో నింపుకొని దర్జాగా వెళ్లిపోయారు. ఒక అపార్ట్​మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్ఐకు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు, చెప్పులను సైతం చోరీ చేశారు. ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు, చెప్పులు కనబడకపోవడంతో ఆయా అపార్ట్​మెంట్​వాసులు షాక్​ అయ్యారు. కాగా చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  GHMC : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉప‌శ‌మ‌నం.. బకాయి వడ్డీపై 90 శాతం మినహాయింపు