Jio Plans : మీ ద‌గ్గ‌ర వంద రూపాయ‌లు ఉన్నాయా.. జియోతో వంద రోజులు పండుగే..!

Jio Plans : మీ ద‌గ్గ‌ర వంద రూపాయ‌లు ఉన్నాయా.. జియోతో మీరు వంద రోజులు పండ‌గ చేసుకోవ‌చ్చు..!
Jio Plans : మీ ద‌గ్గ‌ర వంద రూపాయ‌లు ఉన్నాయా.. జియోతో మీరు వంద రోజులు పండ‌గ చేసుకోవ‌చ్చు..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Jio Plans : జియో Jio ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆఫర్స్ ప్ర‌క‌టిస్తూ.. వినియోగ‌దారులని ఆనందానికి గురి చేస్తుంది. రిలయన్స్ జియో తాజాగా మూడు నెలల అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు 90 రోజుల ఉచిత జియో హాట్‌‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (Jio Hotstar Subscription) అందిస్తుంది. ఈ ప్లాన్స్ తీసుకుంటే మూడు నెలల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా కూడా ల‌భిస్తుంది.

మార్చి 22 నుండి (IPL 2025) ఐపీఎల్ 2025 మొద‌లు కానుండ‌గా, ఈ సీజ‌న్ మొత్తాన్ని అంతరాయం లేకుండా చూసేందుకు జియో ఈ ఆఫ‌ర్ తీసుకొచ్చింది. హాట్‌స్టార్ లో ఫ్రీ స్ట్రీమింగ్ తో ఎంజాయ్ చేయవచ్చు. కొన్నాళ్ల క్రితం లాంచ్‌ అయిన ఈ కొత్త ప్లాన్ “డేటా ఓన్లీ” రీఛార్జ్ ప్యాక్ కాగా, 100 రూపాయల రీఛార్జ్‌తో మీకు 5 GB డేటా మ‌రియు 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ల‌భిస్తుంది.

Jio Plans : సూప‌ర్ ప్లాన్..!

డేటా ప్రయోజనాలతో కూడిన ఈ ప్యాక్ ప్రస్తుతం జియో రీఛార్జ్‌ ఫ్లాట్‌ఫామ్‌ (Jio.com)లో అందుబాటులో ఉంది. 100 రూపాయల జియో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే 90 రోజులు చెల్లుబాటు గడువు ఉంటుంది. దీనిలో యూజర్‌కు మొత్తం 5 GB హై స్పీడ్ ఇంటర్నెట్ లభించ‌నుండగా, ఇది అయిపోయిన తర్వాత కూడా డేటా అందుబాటులో ఉంటుంది. కాకపోతే, అప్పుడు ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు పరిమితం అవుతుంది. జియో 100 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ద్ ఉప‌యోగించి మీరు స్మార్ట్‌ఫోన్ లేదంటే స్మార్ట్ టీవీలో 1080p రిజల్యూషన్‌లో 90 రోజుల పాటు కంటెంట్‌ చూడవచ్చు. అయితే ఈ ప్యాక్‌లో ఎలాంటి కాలింగ్‌ లేదా SMS సౌకర్యం ఉండదు. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ఈ కొత్త ‘డేటా ఓన్లీ ప్యాక్‌’ను యాక్టివేట్ చేసుకోవాలి అంటే వినియోగదారులు బేస్ ప్లాన్ తీసుకోవాలి లేదా మీ ఫోన్‌లో ఇప్పటికే ఉండాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  IPL 2025 : ఐపీఎల్ అభిమానుల‌కి మ‌ళ్లీ నిరాశే.. 5 నిమిషాల‌కే టిక్కెట్లు అన్ని బ్లాక్ అయ్యాయేంటి..!

ఇక ఐపీఎల్‌ ప్రియుల కోసం మరో రెగ్యులర్ ప్లాన్‌ కూడా Jio.comలో ఉంది. అదేంటంటే 149 రూపాయలు, 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో కంటెంట్‌ను కేవలం ఒక్క పరికరంలో మాత్రమే చూడగలరు. ఇది ప్రీమియం ప్లాన్‌ కాదు కాబట్టి ప్రకటనలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. జియో హాట్‌స్టార్ సూపర్ ప్లాన్‌కు సమానమైన స్టాండ్ ఎలోన్ రీఛార్జ్ ప్లాన్ మరొకటి ఉంది, దాని ధర 299 రూపాయలు. జియో 899 రూపాయల ప్లాన్ తీసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా 20 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు

Advertisement