అక్షరటుడే, వెబ్డెస్క్ : Polavaram | కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.2,704 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. కేంద్ర జలశక్తి ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాలో నిధులు జమ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి రూ.5,512 కోట్లు ఇచ్చింది. ఏళ్లుగా సాగుతున్న పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి నిధులు విడుదల చేయాలని కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.2,704 కోట్లు విడుదల చేసింది.
Polavaram | పోలవరానికి రూ.2,704 కోట్ల నిధులు
Advertisement
Advertisement