HMDA : హెచ్ఎండీఏ ప‌రిధి పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. మొత్తం ఎన్ని జిల్లాలు విలీనం కానున్నాయంటే..!

HMDA : హెచ్ఎండీఏ ప‌రిధి పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. మొత్తం ఎన్ని జిల్లాలు విలీనం కానున్నాయంటే..!
HMDA : హెచ్ఎండీఏ ప‌రిధి పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. మొత్తం ఎన్ని జిల్లాలు విలీనం కానున్నాయంటే..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ HMDA : తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంది. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ ప‌రిధి ఇకపై 10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. అంటే హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాలలోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి చేర్చింది ప్రభుత్వం.

HMDA : ఉత్త‌ర్వులు జారీ..

హెచ్ఎండీఏ పరిధిలో మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1,350 గ్రామాలు ఉండ‌గా, ఇప్పుడు ప్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యూచర్ సిటీ(Future City) ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ప్యూచర్ సిటీ పరిధిలోకి రంగారెడ్డి జిల్లాలోని 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు విలీనం కానున్నాయి. ఎఫ్‌సీఏడీఏ పరిధిలోకి ఆమనగల్, కడ్తాల్, ఇబ్రాహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలు ఉన్నాయి. 1975లో హైదరాబాద్‌‌ అర్బన్‌‌ డెవలప్మెంట్‌‌ అథారిటీ హుడాను ఏర్పాటు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Vijayashanti | పదవులు అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదు : విజయశాంతి

అప్పటి దీని విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు. దీన్ని 2008 వరకు ఎవరూ మార్చలేదు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో హుడాను కాస్త హెచ్ ఎండీఏగా మార్చేశారు. పరిధిని కూడా 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. ఇప్పుడు హెచ్ఎండీఏ పరిధి10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది. సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకొని అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ కు మరో 25 ఏళ్లు జోడించే అవకాశాలు కనిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏ విస్తీర్ణం పెరగడంతో పాటు భూముల రేట్లలో భారీగా మార్పులు రానున్నాయి. అభివృద్ధి కూడా ట్రిపుల్ ఆర్(RRR) వరకు విస్తరించనుంది.

Advertisement