అక్షరటుడే, వెబ్డెస్క్: Liquor shops | హోలీ పండుగ నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు(liquor shops closed) మూతపడనున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటలు వరకు మూసి ఉంచాలని సీపీ సాయిచైతన్య( CP Sai Chaitanya ) ప్రకటన విడుదల చేశారు.
ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ షాపులు మూతపడనుండడంతో మద్యం ప్రియులు వైన్ షాప్స్ వద్ద బారులు తీరుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని సీపీ హెచ్చరించారు. హోలీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.