ABVP Nizamabad | బడ్జెట్లో విద్యారంగానికి నిధులివ్వాలి

ABVP Nizamabad | బడ్జెట్లో విద్యారంగానికి నిధులివ్వాలి
ABVP Nizamabad | బడ్జెట్లో విద్యారంగానికి నిధులివ్వాలి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: ABVP Nizamabad | రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ ఇందూర్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్​లో ఉన్న ఫీ రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7శాతం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 12 నుంచి 13శాతం నిధులు కేటాయిస్తుంటే తెలంగాణలో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | మూడు రోజుల్లో నగరంలోని ఆక్రమణలను తొలగించాలి

ABVP Nizamabad | టీచింగ్​ పోస్టులేవి..?

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో గతంలో మంజూరైన టీచింగ్ పోస్టులు 2,878, అయితే ప్రస్తుతం కేవలం 753 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. 70 శాతం ఖాళీలు ఉన్నాయని.. దీంతో అధ్యాపకులపై ఒత్తడి పడుతోందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, దుర్గాదాస్, ఇంద్రసేన, యోగేష్, రంజిత్, మణికంఠ, రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement