MLC elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

MLC elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
MLC elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC elections | తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC) ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగీవ్రమైంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఐదుగురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్​.. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

MLC elections | మరో ఆరుగురు నామినేషన్లు దాఖలు చేసినా..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్​ నుంచి ముగ్గురు, బీఆర్​ఎస్​, సీపీఐ నుంచి ఒక్కొక్కరు నామినేషన్​ వేశారు. అలాగే మరో ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ నామినేషన్లు సరిగ్గా దాఖలు చేయకపోవడంతో తిరస్కరించబడ్డాయి. ఉపసంహరణ గడువు కూడా ముగియడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. త్వరలోనే వీరంతా ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Chandrababu : ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చంద్రబాబు ఆ ముగ్గురినే సెలెక్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనా?

 

కాగా.. రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. తాజాగా అధికార కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వారిలో ఎవరికి పదవి వరిస్తుందో వేచి చూడాలి. ప్రధానంగా విజయ శాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Advertisement