అక్షరటుడే, వెబ్‌డెస్క్ Climbing stairs : ప్రస్తుత కాలంలో ప్రజలందరూ కూడా మెట్లు ఎక్కడం ఒక పెద్ద పనిలా అనిపించి , ఎక్కడం ఎంతో కష్టంగా భావిస్తారు. ఈ రోజుల్లో మెట్లకు బదులు లిఫ్ట్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దిని వలన శారీరక శ్రమ తగ్గి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. లిఫ్ట్ ఎక్కితే వ్యాయామం ఉండదు. కానీ మెట్లు ఎక్కితే, వ్యాయామం అవుతుంది. మెట్లు ఎక్కడం ఎంతో కష్టం అయినా సరే, అది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శరంలో బలం పెరిగి, కొవ్వు కూడా తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పెద్దగా వ్యాయామాలు చేసే అలవాటు లేని వారు ఈ చిన్న మార్పును అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. మెట్లు ఎక్కి దిగడం ద్వారా శరీరానికి సరైన వ్యాయామం జరుగుతుంది.
పెద్ద పెద్ద బిల్డింగులు ఎక్కువ మెట్లు ఎక్కడం చాలా కష్టం, కానీ అందులో లిఫ్టును ఏర్పాటు చేస్తారు. లిఫ్ట్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని, అది వెక్కేసి వెళ్తారు. నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అయితే, లిఫ్టు ఎక్కవలసిన అవసరం లేదు. ఈజీగా మెట్లు ఎక్కేసి వెళ్లొచ్చు. ఇది శరీరానికి వ్యాయామం అవుతుంది. కాదు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మనం సాధారణంగా నడకా లేదా వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనం కంటే, మెట్లు ఎక్కితే శరీరానికి కలిగే ప్రయోజనం ఎక్కువ అని పరిశోధనలు తేలింది. 15 నిమిషాల పాటు నడకా లేదా వాకింగ్ కంటే,15 నిమిషాలు మెట్లు ఎక్కితే రెండు రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
అధిక బరువుతో బాధపడుతున్న వారు, లో పేరుకుపోయిన కొవ్వు కరిగించుటకు మీరు మెట్లు ఎక్కడం ఒక సులువమైన పరిష్కారంగా తీసుకోవచ్చు. ఆరు నిమిషాల పాటు నిరంతరం మెట్లు శరీరంలో మొత్తం కోబు సుమారు 15% వరకు తగ్గుతుంది. ఇటువంటి ప్రత్యేకమైన వ్యాయామా అవసరం లేకుండా మెట్లు ఎక్కితే కొవ్వు సులభంగా తగ్గించుకోవచ్చు. అంతేకాదు, శరీరంలో ముఖ్యమైన భాగాలు కూడా బలపడతాయి. కూడా సమతుల్యత పొందుతాయి. మెట్లు ఎక్కితే శారీరక బలం కూడా పెరుగుతుంది. 8 రాలపాటు క్రమంగా మెట్లు ఎక్కితే శారీరక బలం 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. ఇలా క్రమంగా చేస్తే ఈ వ్యాయామం శరీరానికి పూర్తిగా సహజమైనదిగా ఉండి, కండరాలను సక్రమంగా పనిచేస్తుంది. కేవలం కొవ్వును తగ్గించడమే కాదు కండరాలను బలంగా చేస్తుంది.
మెట్లు ఎక్కడం వలన ఆ శరీరంలో కేలరీలు కూడా కరిగిపోతాయి. కనీసం రోజు, ఐదుసార్లు 15 మీటర్ల మేర మెట్ల ఎక్కితే, 302 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అధికంగా బరువును తగ్గించుకోవడానికి క్రమంగా మెట్లు ఎక్కడానికి చక్కగా వినియోగించుకోవచ్చు. క్యాలరీలు తగ్గించాలంటే ఇది చక్కటి పరిష్కారం. మెట్లకే సమయంలో పాదం మొత్తం మెట్లపై పడేలా జాగ్రత్త పాటించాలి. అలా నెమ్మదిగా మెట్లు ఎక్కితే మీరు గాయపడే ప్రమాదం తగ్గుతుంది. నెమ్మదిగా మెట్లను ఎక్కాలి. అప్పుడు మీరు అన్ని మెట్లు ఎక్కగలరు. ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కితే, త్వరగా అలసిపోతారు. అందుకే నెమ్మదిగా ఎక్కాలి. మీ వెన్ను, చీలమండలంపై ఒత్తిడి లేకుండా, సురక్షితంగా ఉంటుందని అధ్యయనాలు తెలియజేశారు. చిన్న జాగ్రత్తలను పాటిస్తే శరీరానికి మరింత సహాయం చేయవచ్చు.
బీపీలు, షుగర్ లు ఉన్నవారు, శారీరక వ్యాయామానికి సమయానికి కేటాయించడం లేదు. రోజువారి పనుల్లో మెట్లు ఎక్కడాన్ని ప్రాధాన్యంగా చేసుకుంటే, శారీరానికి మంచి వ్యాయామాన్ని అందించిన వారు అవుతారు. దినితో కొవ్వు కూడా తగ్గిపోతుంది. శారీరక బలం పెరిగి, కండరాలను బలంగా మారుస్తుంది. మెట్లు ఎక్కడ వలన ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.