IPL | ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ ఎవరంటే?

IPL | ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ ఎవరంటే?
IPL | ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ ఎవరంటే?
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL | క్రికెట్​ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ (IPL) ​ సీజన్​ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా క్రికెట్​ జట్ల యాజమాన్యాలు వేలంలో పాల్గొని ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఈ సందర్భంగా చాలా జట్లలో మార్పులు చోటు చేసుకోవడంతో కెప్టెన్లను కూడా మారుస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)​ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్​గా భారత ఆల్​రౌండర్​ అక్షరపటేల్​(Axar patel)ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.

IPL | వారిని కొనుగోలు చేసినా..

గత సీజన్​లో ఢిల్లీ కెప్టెన్​గా ఉన్న రిషభ్​ పంత్(Rishab Panth)​ను ఈ సారి లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజనల్​ పంత్​ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ కూడా కేఎల్​ రాహుల్​, డుప్లెసిస్​ను కొనుగోలు చేసింది. వీరు గతంలో వేరే టీంలకు కెప్టెన్లుగా వ్యవహరించారు. దీంతో ఢిల్లీ జట్టు పగ్గాలు వీరికే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. కానీ జట్టు మేనేజ్​మెంట్​ అనుహ్యంగా అక్షర్​పటేల్​కు బాధ్యతలు అప్పగించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  KL Rahul : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడటా..!

IPL | అదరగొడుతున్న అక్షర్​

భారత బౌలింగ్​ అల్​రౌండర్(All Rounder)​ గత కొన్ని రోజులుగా అన్ని ఫార్మాట్లలతో చక్కని ప్రతిభ చూపాడు. అటు బౌలింగ్​, ఇటు బ్యాటింగ్​లో రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్​ ట్రోఫీ(CT – 2025)లో సైతం నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి కీలక ఇన్నింగ్స్​లు ఆడాడు. ఐదు ఇన్నింగ్స్​లలో మొత్తం 109 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు కూడా తీశాడు.

IPL | జట్టును నడిపిస్తా..

కెప్టెన్సీ బాధ్యతలు తనకు అప్పగించడంపై అక్షర్​ పటేల్​ స్పందించాడు. ఏళ్లుగా ఢిల్లీకి ఆడుతున్నానని, జట్టును ముందు ఉండి నడిపిస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి కెప్టెన్​గా నియమించినందుకు టీం మేనేజ్​మెంట్​కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement