Todays Gold Rate : హోలీ వేళ పైపైకి బంగారం ధ‌ర‌లు.. ఈరోజు రేటు ఎంతంటే..!

హోలీ వేళ పైపైకి బంగారం ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో రేటు ఎంత‌?
హోలీ వేళ పైపైకి బంగారం ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో రేటు ఎంత‌?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Todays Gold Rate : బంగారం కొనాలంటే వ‌ణుకు ప‌డుతుంది. సామాన్య ప్ర‌జ‌లు అయితే బంగారం జోలికి వెళ్లే ప‌రిస్థితి లేదు. రోజురోజుకి బంగారం ధ‌రలు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ పోతున్నాయి. మార్చి 14న ఉదయం 7 గంటల సమయానికి దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు పెర‌గ‌డంతో సామాన్యులు వామ్మో అంటున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ మొదటిసారిగా రూ.90 వేల మార్క్ చేర‌గా, వెండి సైతం లక్ష రూపాయాలను చేరుకున్న సంగతి తెలిసిందే.

Todays Gold Rate : పైపైకి..

బంగారం, వెండి కొనాల‌ని అనుకునే వారికి హోళీ పండ‌గ వేళ పెద్ద షాక్ త‌గిలిన‌ట్టు అయింది. అయితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.88,590కి చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.81,210వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,590 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.81,210గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లోనూ ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Gold | ఎయిర్​పోర్టులో బంగారం ఎందుకు పట్టుకుంటారంటే..

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,590 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.81,210గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 88,590 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.81,210కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.88,740, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.81,360 వద్ద కొనసాగుతుంది. అలాగే కోల్ కత్తా, బెంగుళూరు, కేరళ, పూణే వంటి నగరాల్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.88,740కు చేరింది. చూస్తుంటే బంగారం, వెండి ధ‌ర‌లు ఇప్ప‌ట్లో త‌గ్గే సూచ‌న‌లు కనిపించ‌డం లేదు. ఇలానే ఉంటే మాత్రం సామాన్యుడు బంగారం వైపు కూడా చూసే ప‌రిస్థితి ఉండ‌దు.

Advertisement