అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో అక్రమ వెంచర్ల విషయంలో విచారణ చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్ వెంచర్లపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ కట్టడాలు, ఖాళీ స్థలాల కబ్జా, మున్సిపల్ లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని విన్నవించారు.