Telangana Govt : తెలంగాణ వీఆర్వో, వీఆర్ఏలకు కీలక అప్డేట్.. ఆ పోస్ట్‌ల‌కి నోటిఫికేష‌న్

Telangana Govt : తెలంగాణ వీఆర్వో, వీఆర్ఏలకు కీలక అప్డేట్.. ఆ పోస్ట్‌ల‌కి నోటిఫికేష‌న్
Telangana Govt : తెలంగాణ వీఆర్వో, వీఆర్ఏలకు కీలక అప్డేట్.. ఆ పోస్ట్‌ల‌కి నోటిఫికేష‌న్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Telangana Govt : (Telangana) తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ పోస్టులకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ (Posts) పోస్టులకు రాత పరీక్షతో భర్తీ చేయాలని నిర్ణయించింది. మార్చి నెల ఆఖరులోగా నోటిఫికేషన్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి (Ponguleti Srinivasa Reddy) అధికారులు అప్డేట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో పరీక్షకు సంబంధించిన నిర్వహణ, సిలబస్ కోసం టీజీపీఎస్సీ (TGPSC) అధికారులతో చర్చించారు. పరీక్షల ద్వారా పోస్టులు భర్తీ చేస్తే ఎలాంటి సమస్యలు రావని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ క్రమంలో మరో ముఖ్యమైన ప్రకటన కూడా విడుదల చేశారు. వీఆర్ఏ నుండి డైరెక్ట్ గా రిక్రూట్ అయిన వీఆర్వోలు కూడా ఈ పరీక్షను రాయాలని అన్నారు. కాగా 6 నుండి 24 ఏళ్ల రెవెన్యూ (Revenue) సర్వీస్ కలిగి ఉన్న వారిని వెనక్కి తీసుకునేందుకు ఎదురు పరీక్షలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సమాధానంగా అధికారులు స్పందిస్తూ.. గ్రామస్థాయిలో పని చేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన అవసరమో అదే రీతిలో ఈ పరీక్ష ఉంటుందని అన్నారు.

అనుభవం కలిగిన వారికి ఈ పరీక్ష చాలా సులువుగా ఉంటుందని అంటున్నారు. అతి త్వరలోనే పరీక్ష తేదీని కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి పేరును కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించిన పేర్లుపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జీపీవో అనే పేరుకు ఎక్కువగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే జీపీవో అంటే జనరల్ పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు. కానీ ఊరికి, దానికి సంబంధం లేదు. అలాగే జీపీవో కాకపోతే గ్రామ ప్రజాపాలన (Praja Palana Grama) అధికారిగా పేరు పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక (Revenue) రెవెన్యూలోకి తీసుకురావడానికి వీఆర్వో, వీఆర్ఏల (VRO, VRAs)  నుండి ఆప్షన్లు కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 9,654 మంది ఫ్మార్మ్ తో వారంతా (Revenue)రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు రావడానికి సిద్ధమేనన్నట్లు తెలిపారు.

అయితే వీళ్లల్లో వీఆర్వోలు 5,130 మంది, వీఆర్ఏలు 3,534 మంది ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలోని పూర్వ వీఆర్ఏలకు విద్యార్హత మెరిట్ ద్వారా ఒక్కొక్కరికి డబుల్ ప్రమోషన్ ను మంజూరు చేశారు. అంతేకాకుండా డైరెక్ట్ రిక్రూట్ వీఆర్వోల విషయంలో రాత పరీక్ష పేరుతో పునర్ నియామకానికి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంతేకాకుండా అభ్యర్థుల నుండి ఆవేదన కూడా వ్యక్తం అవుతుంది. తాము నిజాయితీగానే పోటీ పరీక్షల ద్వారా ఎన్నికై వచ్చామని అంటున్నారు. అలాంటిది ఇప్పుడు వీఆర్ఏలతో సమానంగా పరిగణిస్తే తాము అన్యాయం అవుతామంటున్నారు. వీఆర్వోలు, వీఆర్ఏల సర్వీస్ ఎక్స్ పీరియన్స్ విషయానికి వస్తే.. చాలా సమస్యలు వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనేది తెలియాలి.

Advertisement