8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఎవ‌రికి ఎంత పెరుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఎవ‌రికి ఎంత పెరుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఎవ‌రికి ఎంత పెరుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, (Central government employees) పెన్షనర్ల జీతాల్లో దాదాపు 30 – 40 శాతం పెంపు రానుంది. 8 వ వేతన సంఘం అమల్లోకి రాగానే ఈ పెంపు ఉంటుందని సమాచారం. హెచ్ఆర్ఏ, డీఏ ఎంత పెరుగుతుందనే డీటైల్స్ తెలుసుకుందాం. 8వ పే కమీషన్ (8th Pay Commission) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అఫిషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఉద్యోగులకు, పెన్షనర్లకు అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస వేతనం 18 వేల నుండి 51,480 రూపాయలకు పెరుగుతుంది. ఒక్క ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెరగడంతో కనీస వేతనం మారుతుంది. మరి ఉద్యోగులకు ఈ 8వ వేతన సంఘంతో కలిగే మార్పులు ఏంటో చూద్దాం. ఈ క్రమంలో ఉద్యోగులకు గరిష్టంగా అన్ని పే స్కేల్స్ వర్తిస్తాయి. అలాగే జీతం 30 నుండి 40 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో పెన్షనర్లుకు తగిన ప్రయోజనం చేకూరుతుంది. టేక్ హోమ్ శాలరీ, అలవెన్సుల్లో పెరుగుదల ఉంటుంది. హెచ్ఆర్ఏ, డీఏ, రిటైర్మెంట్ , HRA, DA, Retirement ప్రయోజనాల్లో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఉద్యోగులకు కొత్త వేతన సంఘం అమలుపై ఆర్ధిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఈ క్రమంలో వారికి ఆర్ధికంగా నిలబడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన (8th Pay Commission) 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రానుంది. ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడి ఉద్యోగుల జీతభత్యాల్లో మార్పుల్ని తీసుకువస్తుంది. మరి ఈ 8వ పే కమీషన్ ద్వారా ఏ ఉద్యోగులకు ఎంత మేరకు జీతాలు పెరుగుతాయనేది ఇప్పుడు చూద్దాం. పే లెవెల్ 1 లో ఉన్న ఉద్యోగులకు 18 వేల నుంచి 51,480 రూపాయల వరకు పెంపు ఉంటుంది.

అలాగే పే లెవెల్ 2 ఉద్యోగులకు 19,900 నుంచి 56,914 రూపాయలు ఉంటుంది. అంటే వీరికి దాదాపు 37,014 రూపాయల జీతం పెరుగుతుంది. పే లెవెల్ 3 ఉద్యోగులకు 21,700 నుంచి 62,062 రూపాయలు పెంచుతారు. అలాగే పే లెవెల్ 4 ఉద్యోగులకు 25,500 నుంచి 72,930 రూపాయలు ఉంటుంది. అంటే వీరికి 47,430 రూపాయల వరకు పెంపు ఉంటుంది. ఇక పే లెవెల్ 5 ఉద్యోగులకు 29,200 నుంచి 83,512 రూపాయల జీతం ఉంటుంది. అంటే వీరికి 54,312 రూపాయల పెంపు లభిస్తుంది. పే లెవెల్ 6 ఉద్యోగుల విషయానికి వస్తే.. 35,400 నుంచి 1,01,244 రూపాయలు పెరుగుతుంది. పే లెవెల్ 7 ఉద్యోగులకు 44,900 నుంచి 1,28,414 రూపాయలు లభిస్తుంది. అంటే వీరికి 83,514 రూపాయల పెంపు ఉంటుంది

Advertisement