అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TTD | తిరుమల వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది తెలంగాణ భక్తులు(TTD DARSHAN) దర్శించుకుంటారు. అయితే టీటీడీ TTD మాత్రం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడం లేదు. దీనిపై తాజాగా మెదక్ ఎంపీ(MP) రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని శుక్రవారం ఆయన దర్శించుకొని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) ఆదేశించారని, టీటీడీ కూడా నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అయినా ఇప్పటి వరకు ఇది అమలులోకి రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1 నుంచే సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని టీటీడీ పాలకమండలి చెప్పినా నేటికి అమలు కావడం లేదన్నారు. తమ లేఖలను పట్టించుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరం కలిసి తిరుమలకు వచ్చి టీటీడీతో తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు.