Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి జగన్ కోటరీ మీద అంత కోపం రావడానికి కారణం ఇదే !

Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి జగన్ కోటరీ మీద అంత కోపం రావడానికి కారణం ఇదే !
Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి జగన్ కోటరీ మీద అంత కోపం రావడానికి కారణం ఇదే !
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Vijayasai Reddy : గ‌త కొద్ది రోజులుగా కోట‌రీ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపిస్తుంది. విజ‌య‌సాయి రెడ్డి Vijayasai Reddy ముందుగా Jagan జ‌గ‌న్‌ని కోట‌రీ నుండి బ‌య‌టకి రాక‌పోతే ప్ర‌మాదం అన్నారు. ఇక ఆ త‌ర్వాత వైసీపీ నాయ‌కులు ఆ కోట‌రీ ప‌దంతో విజ‌యసాయి రెడ్డిని విమ‌ర్శించ‌డం మ‌నం చూశాం. అయితే విజయసాయిరెడ్డి Vijayasai Reddy జగన్ Jagan కోటరి గురించి చెప్పిన తర్వాత రాజకీయవర్గాలు పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే జగన్ Jagan ఓ వలయం ఏర్పాటు చేసుకుని అందులోనే ఉన్నారు. బయట ఏం జరుగుతుందో కళ్ల ముందు కనిపించినా సరే ఆయన ఆ వలయంలో ఉన్న వ్యక్తులు చెప్పేదే నమ్ముతారు.. ఆయనను ఊబిలో దింపిన కోటరీలో ఎవరెవరు ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

Vijayasai Reddy : అంతా ట్విస్ట్‌ల మ‌యం..

ముందుగా కోట‌రి Vijayasai Reddy విజ‌య‌సాయి రెడ్డిదే. అయితే 2019 ఎన్నిక‌ల వ‌ర‌కే అది జ‌రిగింది. కాని ఉత్తరాంధ్రపై ఆశపడి అటు వైపు వెళ్లడంతో ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో Tadepalli Palace, Sajjala Ramakrishna Reddy సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని కోటరీని మార్చేసుకున్నారు. Vijayasai Reddy విజయసాయిరెడ్డిని మెల్లగా దూరం చేశారు. కోటరీలో జగన్మోహన్ రెడ్డి సతీమణి కూడా ఉంటారని అంటున్నారు. నిజానికి జగన్ Jagan సతీమణి భారతి రెడ్డి.. విజయసాయిరెడ్డికి రెండో సారి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారని YCP వైసీపీలో అందరికీ తెలుసు. మరి ఆ కోటరీపై విజయసాయిరెడ్డికి ఎందుకు కోపం వచ్చింది ? వైసీపీలో జరిగిన పరిణామాల్ని చూస్తే విజయసాయిరెడ్డిని ప్లాన్డ్ గా జగన్ కు దూరం చేశారని అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  Vijaysai Reddy : తననీ తన భార్యనీ అవమానించిన విజయసాయి రెడ్డికి జగన్ షాకింగ్ కౌంటర్

జగన్ సీఎంగా ఉండగా, విజయసాయిరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితోపాటు అప్పట్లో సీఎంవోలో పనిచేసిన ఓ కీలక అధికారి కోటరీగా వ్యవహరించేవారని టాక్. Vijayasai Reddy విజయసాయిరెడ్డి వైసీపీ YCP రాజకీయ వ్యవహారాలు చూడగ,సజ్జల ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. అయితే ప్రభుత్వ వ్యవహారాల్లో తనకు జోక్యం లేకపోవడంతో విజయసాయిరెడ్డి Vijayasai Reddy అప్పట్లోనే కొంత అసంతృప్తితో ఉండేవారని ప్రచారం జరిగింది. మ‌రోవైపు గతంలో చోటుచేసుకున్న అక్రమాలను కూట‌మి ప్ర‌భుత్వం తవ్వితీస్తుండటం, అన్నింటిలోనూ విజయసాయిరెడ్డి A2 అవుతుండటం, అన్నీ తానై వ్యవహరించిన సజ్జలను వదిలేసి ప్రభుత్వం తన వెంట పడటంతో విజ‌య‌సాయి రెడ్డి రూటు మార్చిన‌ట్టు చెబుతున్నారు.

Advertisement