Koreans : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్లామర్ పై ఫోకస్ ఎక్కువైంది. అందంగా కనిపించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అయితే కొరియన్ స్కిన్ కేర్ Korean skin care అంటే చాలామందికి ఇష్టం. వాళ్లలాగా మెరిసే చర్మం కావాలని చాలామంది అనుకుంటారు. కొరియన్లు Koreans వాళ్ల చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు ఎక్కువగా వాడుకుంటారు. వారి ముఖాన్ని గాజులా మెరిసేందుకు ఏమేమి చిట్కాలు వాడతారో ఇప్పుడు చూద్దాం. దేశంలోని ప్రజలు తమ చర్మాన్ని సరిగ్గా చూసుకోవడానికి క్లెన్సింగ్ మరియు స్క్రబ్బింగ్‌లని అనుసరిస్తారు. వారి ముఖాలకి కొన్ని నూనెలు రాసుకుంటారు.
Koreans : ఇవి పాటించండి..
కామెల్లియా నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సాయపడుతుంది. తలపై రుద్దినప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దానిని వీరు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా జోజోబా ఆయిల్. ఇది చర్మానికిసహజ సీరంలా పని చేస్తుంది. చర్మం తేమగా ఉండేందుకు సాయ పడుతుంది. బియ్యం కడిగిన నీళ్లు చర్మానికి మంచి టోనర్ లాగా పనిచేస్తాయి. చర్మ సమస్యలు పోగొట్టడానికి సహాయపడతాయి.అందుకే వారు వాటిని కూడా ఉపయోగిస్తుంటారు. బియ్యం నీళ్లు చర్మంలో తేమని కాపాడతాయి. మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. ఇది చర్మాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. ఇది చర్మం మీద వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ముడతలు, వయసు మీద పడడం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
కొరియన్లు టీ ట్రీ ఆయిల్ Koreans tea tree oil, రోజ్ షిప్ ఆయిల్ rosehip oil మరియు ఆర్గాన్ ఆయిల్‌లని ఉపయొగిస్తారు. ఆయిల్ క్లెన్సింగ్ కూడా ఉపయొగిస్తారు. దీని అర్ధం శుద్ధీకరణ.కొరియన్స్ పని తర్వాత ఇంటికి వచ్చాక మేకప్ మరియు సన్ స్క్రీన్‌తో సహ వారి ముఖం నుండి అన్నింటిని తొలగించడానికి నూనెని ఉపయోగిస్తారు. బయటకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ధరించండి అని మనం విన్నాము. కొరియన్స్ సన్‌స్క్రీన్స్ Korean sunscreens పక్కా వాడతారు. వర్షాకాలంలో కూడా బయటకి వెళ్లిన వెళ్లకపోయిన సన్‌స్క్రీన్ వాడడం మంచిది. ఇక మీ చర్మం పొడిబారకుండా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలి. కొరియన్స్ Koreans ఎక్కువగా నీరు తాగుతూ వారి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతారు.