అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డి పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఎల్లారెడ్డి పట్టణాధ్యక్షుడు ఆదిమూలం సతీశ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎల్లారెడ్డి మండలాధ్యక్షుడు జలంధర్ రెడ్డి, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు నర్సింలు, డీసీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, శ్రవణ్ కుమార్, దేవదాస్, ఇమ్రాన్, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, నాగం రాజయ్య, అరవింద్ గౌడ్, బబ్లూ, విఠల్, నాగరాజు పాల్గొన్నారు.
Yellareddy | జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దహనం
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement