అక్షరటుడే, వెబ్‌డెస్క్ Pawan Kalyan : పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన Janasena జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గర్జించారు. ఆయన ఇన్నాళ్లు పడ్డ కష్టం, దక్కిన ప్రతి ఫలం, రాజకీయాలు, తెలంగాణ అంశం ఇలా పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దొద్దంటూ స్టాలిన్ మాట్లాడిన మాటలకి ఈ సభలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొందరు భాష, సంస్కృతినీ తిడుతున్నారని.. హిందీని రుద్దుతున్నారంటా హడావుడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు పవన్. ‘అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు.
Pawan Kalyan : ప్రకాశ్ రాజ్ పంచ్‌లు..
“అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా?, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది” అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కామెంట్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్‌కి తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు ప్రకాశ్ రాజ్.. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ (Prakash Raj ) ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
ప్రకాష్ రాజ్ (Prakash Raj) గతంలో కూడా పవన్ కళ్యాణ్‌కి పలు విషయాలలో కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దానిపై పవన్ పెద్దగా స్పందించలేదు. గత కొద్ది కాలంగా Prakash Raj ప్రకాశ్ రాజ్ సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.
పవన్ కామెంట్స్.. ప్రకాష్ రాజ్ కౌంటర్..#PrakashRaj #DeputyCMPawanKalyan #NTVTelugu pic.twitter.com/Ro7hkmR0yy
— NTV Telugu (@NtvTeluguLive) March 15, 2025