అక్షరటుడే, వెబ్‌డెస్క్ Balakrishna – Chiranjeevi : టాలీవుడ్ Tolly Wood ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, Chiranjeevi నందమూరి బాలకృష్ణకి Balakrishna ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వారిద్దరు తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఇద్దరికి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే Chiranjeevi చిరంజీవి- బాలయ్య Balakrishna కలిసి ఏదైన సినిమా చేస్తే బాగుంటుందని ఎందరో అనుకున్నారు. కాని అది ఇప్పటి వరకు జరగలేదు. ఓసారి చిరంజీవి.. బాలయ్యతో కలిసి నటించాలనే కోరికను తెలియజేశారు. దీంతో ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఆ ప్రాజెక్ట్‌ని ఎవరు డీల్ చేయగలరు అని కూడా ముచ్చటించుకున్నారు.
Balakrishna – Chiranjeevi : నిజం కానుందా?
బాలయ్యకి బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శీను కాగా, ఆయన టేకప్ చేస్తాడా లేదంటే తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ Nelson Dilip Kumar తీసుకునేలా ఉన్నాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ Rajinikanth హీరోగా ‘జైలర్ 2’కి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు నటిస్తారని ముందుగానే తేలిపోయింది. ‘జైలర్’ లో కొనసాగిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మరింత మంది స్టార్స్ యాడ్ అవుతారని చెప్పుకొచ్చాడు. దీంతో టాలీవుడ్ నుంచి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది. దాదాపు ఆయన ఎంట్రీ కన్పమ్ అయిందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇటీవలే రజనీకాంత్ Rajinikanth ఫోన్ చేసి చిరంజీవి Chiranjeevi కూడా నటించాలని అభ్యర్దించడంతో చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. రజనీ మాట కాదనలేక బాలయ్యతో పాటు చిరు కూడా ఒకే చెప్పారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. అదే నిజమైతే ‘జైలర్ 2’ JAILER 2 సంచలనం అవుతుంది. అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడతాయి. కోలీవుడ్ కి ఇంత కాలం సాధ్యం కాని 1000 కోట్ల క్లబ్ కూడా జైలర్ 2 JAILER 2 తో సాధ్యమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలానే ఎప్పటి నుండో ఆశగా ఎదురు చూస్తున్న మెగా-నందమూరి ఆశ..కోరిక కూడా నెరవేరుతుంది. ఇలాంటి సినిమాలో బాలయ్య-చిరు పాత్రలు మరింత పవర్ ఫుల్ గా..స్టైలిష్ గానూ ఉంటాయి.