అక్షరటుడే, వెబ్‌డెస్క్ WhatsApp : ఈ రోజుల్లో ఫోన్ లేనివారు లేరు. చిన్న పిల్లల నుండి పండు ముసలి వారు కూడా ఫోన్స్ వాడుతున్నారు. ఇక ఫోన్ వినియోగించే వారు అందులో తప్పనిసరిగా WhatsApp వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. దీని ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుంది. చాటింగ్, కాలింగ్ ఇలా ఒకటేంటి ఇందులో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అయితే లక్షలాది మంది వాట్సాప్ వాడుతుండగా, చాలా మందికి ఇందుకు సంబంధించి కొన్ని సందేహాలు ఉంటాయి. అందులో ఒకటి నంబర్ సేవ్ చేయకుండా ఎవరికైనా కాల్ చేయాల్సి వస్తే ఎలా అనేది.? మీరు నెంబర్ సేవ్ చేయకుండా నేరుగా ఎవరికైనా వాట్సాప్ కాల్స్ WhatsApp calls చేయవచ్చు. అదెలాగో ఇక చూద్దాం..
WhatsApp : ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి..
వాట్సాప్‌లోని ఈ కొత్త ఫీచర్ గురించి చాలా మందికి తెలియదు. నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో కాల్స్ చేసేందుకు ఈ సింపుల్ ట్రిక్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. కొత్త వాట్సాప్ అప్‌డేట్ తర్వాత నంబర్‌ను సేవ్ చేయకుండా కూడా కాల్స్ చేయవచ్చు.
ఇందుకోసం WhatsApp వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కాలింగ్ సెక్షన్ వెళ్లండి. ‘+’ ఐకాన్‌పై ట్యాప్ చేసి ‘Call Number’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై మీ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ నంబర్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంటే మీరు నేరుగా కాల్ చేయవచ్చు. ఈ ఫీచర్ యాప్‌లో అందుబాటులో లేకపోతే.. మీరు బ్రౌజర్‌ని ఉపయోగించి నంబర్‌ను సేవ్ చేయకుండానే కాల్స్ చేయవచ్చు. ఇందుకోసం (Chrome) లేదా (Safari) బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్‌లో (https://wa.me/91XXXXXXXXXX) అని టైప్ చేయండి.
ఇందులో X దగ్గర మీర ఎవరికి ఫోన్ కాల్ చేయాలో 10 అంకెల నెంబర్ టైప్ చేయండి. (91 తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి). ఆ తర్వాత Go ట్యాప్ చేసి WhatsApp వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కాల్ లేదా మెసేజ్ పంపవచ్చు. కొత్త నంబర్ నుంచి మళ్లీ మళ్లీ చాట్ చేయాల్సిన లేదా కాల్ చేయాల్సిన వారికి ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డెలివరీ ఏజెంట్లు, హోటల్, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు అందించే వాళ్లు కొత్త వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.