అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి ఐదో విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న లక్షా 25వేల ఎకరాల పంటల సాగు కోసం ఇప్పటి వరకు నాలుగు విడతల్లో సుమారు 8 టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ(Nizamsagar canal) ద్వారా ఐదో విడత నీటిని 1,213 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులకు(17.80 టీఎంసీలు) గాను 1396.75 అడుగుల(8.22 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ సోలోమన్ తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
Nizamsagar | నిజాంసాగర్ నీటి విడుదల
Advertisement
Advertisement
Advertisement