అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Star link | దేశంలో టెలీకం రంగ సేవలు ఎంత విస్తరించినా ఇంకా చాలా ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య వేధిస్తోంది. మారుమూల, కొండ ప్రాంతాల్లో పలు నెట్‌వర్క్‌ల(Network) సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఆయా ప్రాంతాల్లో సంబంధిత టెలికాం ఆపరేటర్ల సెల్‌టవర్లు లేకపోవడమే.. ఇక నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. టవర్ (Cell tower) లేకున్నా సిగ్నల్ అందనుంది. ఈ దిశగా ఎయిర్‌టెల్(Airtel), జియో(Jio) అడుగులు వేశాయి.
Star link | స్టార్‌లింక్‌తో ఒప్పందం
ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలన్ మస్క్ స్టార్‌లింక్(Star link) కంపెనీతో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. ఈ కంపెనీతో ఇటీవల ఎయిర్‌టెల్ (Airtel) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం జరిగిన 24 గంటల వ్యవధిలోనే రిలయన్స్ జియో (Jio) కూడా ఎలన్‌మస్క్ కంపెనీతో జత కట్టడం విశేషం. ప్రస్తుత దేశీయ టెలీకం రంగంలో జియో, ఎయిర్‌టెల్ మెజారిటీ వాటా కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలు ఇప్పుడు స్టార్‌లింక్‌తో ఒప్పందాలు చేసుకోవడంతో దేశంలోని టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Star link | ఇప్పటికే పలు దేశాల్లో..
ఎలన్‌మస్క్ కంపెనీ స్టార్‌లింక్(Star link) ఇప్పటికే పలు దేశాల్లో తన సేవలను అందిస్తోంది. భారత్‌లో 2021లోనే తీసుకురావాలని ఎలన్ మస్క్ ఆశించగా రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఆలస్యం అయింది. ఇంతలో స్టార్ లింక్‌తో ఎయిర్ టెల్, జియో ఒప్పందంతో త్వరలోనే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మస్క్ కంపెనీ స్టార్ లింక్‌కు ప్రస్తుతం ఆర్బిట్‌లో సుమారు 7,000 ఉపగ్రహాలు ఉన్నాయి. వాటి ద్వారా 100 దేశాల్లో సేవలు అందిస్తోంది. అయితే దీనిద్వారా కేవలం ఇంటర్నెట్(Internet) సేవలు మాత్రమే పొందవచ్చు. దీనికోసం రూటర్ లాంటి పరికరం ఉంటుంది. అది శాలిటైట్ నుంచి సిగ్నల్స్ రీసివ్ చేసుకొని అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందేలా చేస్తుంది.