Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో శనివారం ఉదయం అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు ఎదురుపడ్డారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు వస్తుంటే ముఖ్యమంత్రి వచ్చినంత హంగామా ఉందన్నారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ… వెంకన్న తనపై అభిమానంతో అలాగే అంటారని, పట్టించుకోవద్దు అంటూ ముందుకు సాగారు.
Advertisement
Advertisement