అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | పసుపు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. శాసన మండలి(counsil) మీడియా పాయింట్ వద్ద శనివారం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీలతో కలిసి ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పసుపు పంట క్వింటాలుకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. పేరుకు పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరపై ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
MLC Kavitha | అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీ
శాసనమండలిలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని కవిత ఆరోపించారు. దీని గురించి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే ఛైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారన్నారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో కూడా తమ పార్టీ సభ్యులపై ఏకవచనంతో మాట్లాడారన్నారు. శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ సభ్యులకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.