Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : Bodhan | అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. టాస్క్ఫోర్స్ ఇన్ఛార్జి ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో శనివారం బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలో దాడులు జరిపారు. అక్కడ అనుమతులు లేకుండా మొరం తవ్వుతున్న జేసీబీతో పాటు నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. పట్టుకున్న వాహనాలను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
Advertisement