Health Benefits : ఈ పండు మీకు తెలుసా..! ఎప్పుడైనా చూశారా.. దీంతో గుండె జబ్బులు పరార్.. కొవ్వు వెన్నెల కరగాల్సిందే..?

Health Benefits : ఈ పండు మీకు తెలుసా..! ఎప్పుడైనా చూశారా.. దీంతో గుండె జబ్బులు పరార్.. కొవ్వు వెన్నెల కరగాల్సిందే..?
Health Benefits : ఈ పండు మీకు తెలుసా..! ఎప్పుడైనా చూశారా.. దీంతో గుండె జబ్బులు పరార్.. కొవ్వు వెన్నెల కరగాల్సిందే..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Health Benefits : ప్రపంచంలో చాలా రకాల పండ్లు పండిస్తున్నారు. ప్రకృతి మనకి ఎన్నో రకాల పండ్లను అందిస్తూ ఉంది. అందులో కొన్ని పండ్ల గురించి మనకి తెలుసు. మనకి తెలియని పండ్లు మనం ఎప్పుడూ చూడని పండ్లు కూడా ఉన్నాయి. ఇటువంటి పండే నోనీ పండు. పండు తో జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. దీంతో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించాలంటే చాలా ఈజీ. గుండెపోటు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. గుండె జబ్బులు ఉన్న వారికి ఇది మంచి ఔషధం. బ‌రువు తగ్గాలనుకునే వారికి ఈ పండు బెస్ట్ ఆప్షన్. నోనీ పండు నాభి, నడుములో పేరుకుపోయిన కొవ్వును కరిగించుటకు సహాయపడుతుంది. ఇంకా శరీరంలో అదనపు కొవ్వును కూడా కరిగించగలదు.

భారతదేశంలో ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో మూలికలు, ఔష‌దాల‌ను కలిగిన నిలయం. ఆయుర్వేద మూలికలతో ఎన్నో ప్రాణాంతకరమైన వ్యాధులను నయం చేయుటకు వినియోగిస్తూ ఉంటారు. అలాంటి ఆయుర్వేద ములిక గల నోని మొక్క అద్భుతమైన ఔషధ నిధి. ఈ నోనీ పండు భారత దేశంలో సర్వసాధారణంగా కనిపించే ఒక రకమైన పండు. దీన్ని ఇంగ్లీషులో మల్బరీ లేదా నోని అంటారు. నోని మొక్క శాస్త్రీయ నామం. మెరిండా సిట్రి ఫోలియా, నోనీ మొక్కలు చిన్న చెట్లులా లేదా పెద్ద పొదల రూపంలో కూడా పెరుగుతాయి. దినీ పండు ఆకారం గుండ్రంగానూ, కొద్దిగా మృదువుగా కూడా ఉంటుంది.

ఈ నోని ఫ్రూట్ పండినప్పుడు దాని రంగు లేత పసుపు నుంచి బంగారు రంగులోకి మారుతుంది. నోనీ పండు ఆకులు, వేర్లు, బెరడు మొదలైన వాటితో మందులు, ఆహార పదార్థాలలో వినియోగిస్తుంటారు. ఈ నోనీ లో సహజ చక్కెర‌ నియంత్రణ లక్షణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుట కూడా ఈ నోనీ ఈ పండు ఉపయోగపడుతుంది. ఈ పండు చెక్కర నియంత్రణ లక్షణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. నోనీ పండు జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగితే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఈ నోని పండ్ల జ్యూస్ చ‌ర్మ‌ ఆరోగ్యం కాపాడుతూ, చ‌ర్మాన్ని ప్రకాశవంతంగా మార్చగలుగుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Health Benefits : పొట్లకాయే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి... తెలిస్తే జన్మలో ఆ పని చేయరు...?

ఈ జ్యూస్ తాగితే ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయి. ఇంకా ఈ నోనీ ఫ్రూట్ జుట్టుకి కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నోనీ లో సహజ శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఈ నోనీ పండు కీల మంటలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నోని పండు. నోనీ పండు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. నోని జ్యూస్ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గిపోతుంది. హార్ట్ ఎటాక్ వచ్చే వ్యాధిగ్రస్తులకు ఈ నోనీ జ్యూస్ ఎంతో ఉపయోగకరం. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ఫ్రూటు మంచిది. నాభి చుట్టూ, నడుము చుట్టూ పేర్కొన్న కొవ్వును కరిగించుటకు ఈ నోనీ జ్యూస్ ఔషధంగా పనిచేస్తుంది.

Advertisement