SVSN Varma : వర్మ వెళ్ళిపోతే టీడీపీకి ఎంత నష్టం..? వర్మకి ఎంత నష్టం ?

SVSN Varma : వర్మ వెళ్ళిపోతే టీడీపీకి ఎంత నష్టం..? వర్మకి ఎంత నష్టం ?
SVSN Varma : వర్మ వెళ్ళిపోతే టీడీపీకి ఎంత నష్టం..? వర్మకి ఎంత నష్టం ?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ SVSN Varma : గ‌త కొద్ది రోజులుగా Pithapuram పిఠాపురం వ‌ర్మ Varma సెంట్రాఫ్ ది అట్రాక్ష‌న్ అవుతున్నాడు.పిఠాపురం వ‌ర్మ‌గా పేరొందిన ఎస్‌వీఎస్ ఎన్ వ‌ర్మ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం పిఠాపురం స్థానాన్ని త్యాగం చేశారు. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan Kalyan కూడా స్ప‌ష్టం చేశారు. అయితే జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు Nagababu చేసిన ప్రసంగం సంచలనాలకు తెర తీసింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడింది పూర్తిగా జనసేన నాయకులు, కార్యకర్తలేనని , కొంద‌రు తామే గెలిపించామనుకుంటే అది వారి ఖర్మేనంటూ నాగ‌బాబు చుర‌క‌లు అంటించారు. తెలుగుదేశం పార్టీ Telugu Desam Party సీనియర్ నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించే నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యమే.

SVSN Varma : ఎవ‌రికి న‌ష్టం..

అయితే పొత్తులో భాగంగా పిఠాపురాన్ని వదలుకున్నారు వ‌ర్మ‌. తొలి జాబితాలోనే ఆయనను శాసన మండలికి పంపిస్తానంటూ చంద్రబాబు Chandrababu సైతం అప్పట్లో హామీ ఇచ్చిన ఇంత వ‌ర‌కు దానిని నెర‌వేర్చ‌లేదు. టీడీపీ TDP కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వ‌ర్మ‌కి మొండిచేయి ఎదురైంది. ఆయ‌న స్థానాన్నే నాగ‌బాబు తీసుకున్నార‌నే అభిప్రాయం జిల్లా రాజ‌కీయాల‌లో గ‌ట్టిగా వినిపిస్తుంది. సాక్షాత్తూ Chandrababu చంద్రబాబే హామీ ఇచ్చినా కూడా శాసన మండలికి వర్మ ఎంపిక కాలేకపోయారనే అసహనం ఇప్పటికే వర్మ క్యాడర్‌లో బ‌లంగా ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Pawan Kalyan : బ్రేకింగ్.. సినిమాలకి పవన్ కళ్యాణ్ గుడ్ బై !

అయితే జనసేన ఆవిర్భావ సభ Janasena Formation Day తరువాత అంద‌రికి అర్ధ‌మైన విషయం ఏంటంటే వర్మకు పిఠాపురంలో చోటు ఉండకపోవచ్చనే అంటున్నారు.ఇప్పుడు ఆయ‌న ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనుచరుల్లో నెలకొన్న ఈ అసహనాన్ని, అసమ్మతిని తెలుగుదేశం అధి నాయకత్వం చ‌ల్లార్చే అవకాశం ఏమైన ఉందా? నాగబాబు వ్యాఖ్యలు చేసిన డ్యామేజీని ఎలా చ‌క్క‌దిద్దుతారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో టికెట్‌ను త్యాగం చేయ‌డం.. ప‌వ‌న్‌కు కేటాయించ‌డం ద్వారా.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో వ‌ర్మ ఫాలోయింగ్ చాలా పెరిగింది. ఇప్పుడు ఆయ‌న‌కి అన్యాయం జ‌రుగుతుంద‌ని క్షత్రియ సామాజిక వ‌ర్గం బ‌లంగా భావిస్తుంది. వ‌ర్మ విష‌యంలో సాధ్య‌మైనంత వేగంతో స్పందించి.. ఈ విష‌యానికి పులిస్టాప్ పెట్ట‌క‌పోతే క్షత్రియ సామాజిక వ‌ర్గంలో పార్టీ ప‌లుచ‌న అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే టీడీపీ నుండి వ‌ర్మ త‌ప్పుకున్నా ఆయ‌న‌కున్న ఫాలోయింగ్ త‌గ్గ‌దు.

Advertisement