Indiramma Houses | వాళ్లు ఓకే అంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు.. లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారంటే?

Indiramma Houses | వాళ్లు ఓకే అంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు.. లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారంటే?
Indiramma Houses | వాళ్లు ఓకే అంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు.. లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారంటే?
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indiramma Houses | తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఇప్పటికే చాలామంది నిరుపేదలు, ఇండ్లు లేని వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ముగిసింది. మొదటి విడతలో భాగంగా పలువురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడత పూర్తయిన తర్వాత రెండో విడత లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం ప్రారంభించింది.

రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అర్హత ఉన్నవారికే ఇందిరమ్మ పథకం ద్వారా లబ్దిదారుడిగా ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని జిల్లాల వారీగా ఆయా కలెక్టర్లు చూడనున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత కలెక్టర్లదే. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Indiramma Houses : ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్దిదారుడికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలను ఆర్థిక సాయంగా అందించనుంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నీ కలెక్టర్ల దగ్గరే ఉండటంతో.. లబ్దిదారుల ఎంపిక విషయంలో కూడా నిర్ణయం తీసుకునే హక్కు కలెక్టర్లకే ఇచ్చారు. అంటే.. కలెక్టర్లదే ఫైనల్ నిర్ణయంగా ఉండనుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లు ఇప్పట్లో లేనట్టేనా?

మొత్తం మూడు దశల్లో లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 562 గ్రామాలను ఎంపిక చేశారు. అందులో 71,482 మందిని లబ్దిదారులుగా గుర్తించారు. వారిలో 6600 మంది తమ ఇంటి నిర్మాణాలను కూడా ప్రారంభించారు. వాటికి సంబంధించిన బిల్లులను రిలీజ్ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. బేస్ మెంట్ లేవల్ పూర్తి కాగానే బిల్లులను అందించనున్నారు అధికారులు.

Advertisement