అక్షరటుడే, వెబ్‌డెస్క్ Yuvraj Singh : మాజీ క్రికెటర్లతో నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీ Masters League T20 Tournament ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో Sachin Tendulkar సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ జట్టు వెస్టిండీస్ మాస్టర్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఓవైపు రోహిత్ శర్మ సారథ్యంలోని Team India టీమిండియా వరుసగా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లను గెలిస్తే.. భారత మాజీ క్రికెటర్లు తొలి ఇంటర్నేషనల్ లీగ్ టోర్నీలోనే విజేతగా నిలిచారు. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన West Indies Masters వెస్టిండీస్ మాస్టర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగా, భారత్ 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. అంబటి రాయుడు(50 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74) , కెప్టెన్ సచిన్ టెండూల్కర్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు.
Yuvraj Singh : పెద్ద గొడవే..
చివర్లో Yuvraj Singh యువరాజ్ సింగ్(11 బంతుల్లో ఫోర్‌తో 13 నాటౌట్), స్టువర్ట్ బిన్నీ(9 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 నాటౌట్) ఇండియా మాస్టర్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, వెస్టిండీస్ ప్లేయర్ టినో బెస్ట్ మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చేసుకుంటుండగా, వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా Captain Brian Laraఅక్కడకు చేరుకొని వారికి సర్ధి చెప్పారు. దాంతో గొడవ సద్ధుమణిగింది మరోవైపు Ambati Rayudu అంబటి రాయుడు కూడా టినో బెస్ట్ ను ప్రశాంతంగా ఉండాలంటూ కోరుతూ ఉండడం వీడియోలో మనకు కనిపించింది.
ఇండియా మాస్టర్స్ India Masters బ్యాటింగ్ సమయంలో క్రీజులో అంబటి రాయుడు, Ambati Rayudu, Yuvraj Singh, యువరాజ్ సింగ్ ఉన్నారు. టినో బెస్ట్ తన ఓవర్ పూర్తిచేసి గాయం కారణంగా మైదానం వీడుతుండటంపై అంపైర్ తో ప్రస్తావించాడు. అంపైర్ బిల్లీ బౌడెన్ బహుశా టినో బెస్ట్ ను తిరిగిరమ్మని కోరాడు. దీంతో చిరాకుపడిన టినో యువరాజ్ సింగ్ వైపుకు దూసుకొచ్చాడు. యువరాజ్ సైతం వెనక్కుతగ్గలేదు. దీంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి వేలు చూపిస్తూ యువరాజ్ చాలా సీరియస్‌గా మాట్లాడారు. ఇక ఈ ఘటన తరువాత యువరాజ్ సింగ్ బంతిని సిక్స్ కొట్టి తన బ్యాట్ ను టినో బెస్ట్ వైపు చూపినట్లు కనిపించాడు. అయితే, మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, టినో బెస్ట్ సరదాగా మాట్లాడుకోవటం గమనార్హం.
Lafda with Yuvraj vs Tino best ☠️ #IMLT20Final #YuvrajSingh #IMLT20
— CricFreak69 (@Twi_Swastideep) March 16, 2025