Rithu Chowdary | బెట్టింగ్​యాప్స్​ కేసుల భయం.. సారీ చెప్పిన మరో నటి

Rithu Chowdary | బెట్టింగ్​యాప్స్​ కేసుల భయం.. సారీ చెప్పిన మరో నటి
Rithu Chowdary | బెట్టింగ్​యాప్స్​ కేసుల భయం.. సారీ చెప్పిన మరో నటి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rithu Chowdary | బెట్టింగ్​ యాప్స్(Betting apps) ప్రమోటర్లకు కేసుల భయం పట్టుకుంది. ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్​ సజ్జనార్(Sajjanar)​ బెట్టింగ్​ యాప్​లపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రమోట్​ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు సైతం స్పందించి బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేస్తున్న సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. దీంతో గతంలో బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్ చేసిన వారు భయపడుతున్నారు. ఎక్కడ తమ మెడకు కేసులు చుట్టుకుంటాయోనని ముందుగానే సారి చెబుతూ.. వీడియోలు పోస్టు చేస్తున్నారు.

Rithu Chowdary | బెట్టింగ్​ యాప్​లకు దూరంగా ఉండండి

గతంలో బెట్టింగ్ ​యాప్​ ప్రమోట్​ చేసిన సినీ నటి రీతూ చౌదరి తాజాగా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్​ చేశారు. తను ఏడాదిన్నర క్రితం తెలిసో, తెలియకో బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేశానన్నారు. తాజాగా ఆ వీడియో వైరల్​ కావడంతో స్పందిస్తున్నట్లు చెప్పారు. బెట్టింగ్​ యాప్​ ప్రమోట్​ చేసినందుకు క్షమాపణ చెప్పారు. సెలబ్రెటీలు, ఇన్​ఫ్లూయెన్సర్ల మాటలు నమ్మి బెట్టింగ్​ జోలికి వెళ్లొద్దని ఈ భామ కోరింది. ఎవరి ఫోన్లలోనైనా ఈ యాప్స్​ ఉంటే వెంటనే డిలీట్​ చేయాలని సూచించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Bhayya Sunny Yadav | భయ్యా సన్నీయాదవ్ ​కేసు.. డీఎస్పీ కీలక వ్యాఖ్యలు

Rithu Chowdary | ఇద్దరిపై కేసు నమోదు

బెట్టింగ్​ యాప్​ ప్రమోట్​ చేసిన విషయంలో సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్​ భయ్యా సన్నీ యాదవ్(Sunny Yadav)​, యూట్యూబర్​ హర్షసాయి(Harsha sai)పై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మిగతా ప్రమోటర్లు క్షమాపణ చెబుతున్నారు. నటి సురేఖవాణి కూతురు హీరోయిన్​ సుప్రీత(Supreetha) సారీ చెప్పిన మరుసటి రోజే.. రీతూ చౌదరి సైతం క్షమాపణ చెప్పారు.

Advertisement