Manchu Vishnu : ప్రభాస్ నా ఫిజిక్ చూసి షాక్ అయ్యాడు.. మంచు విష్ణు కామెంట్స్​కు రెబల్ ఫ్యాన్స్ హర్ట్..!

Manchu Vishnu : ప్రభాస్ నా ఫిజిక్ చూసి షాక్ అయ్యాడు.. మంచు విష్ణు కామెంట్స్ కి రెబల్ ఫ్యాన్స్ హర్ట్..!
Manchu Vishnu : ప్రభాస్ నా ఫిజిక్ చూసి షాక్ అయ్యాడు.. మంచు విష్ణు కామెంట్స్ కి రెబల్ ఫ్యాన్స్ హర్ట్..!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Manchu Vishnu : మంచు విష్ణు Manchu Vishnu హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, Prabhas, అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohanlal), మోహన్ బాబు(Mohan Babu) వంటి స్టార్స్ నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. సినిమా నుంచి ఇప్పటికే శివ శివ శంకరా సాంగ్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకోగా రెండో పాటగా రిలీజైన లవ్ సాంగ్ కాస్త విమర్శలు తెచ్చుకుంది.

ఇక ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్​లో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు మంచు విష్ణు. ప్రభాస్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని.. డబ్బు గురించి అడిగితే విష్ణుని కొడతా అన్నట్టుగా చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ అందించాడని చెప్పాడు. ఐతే అంతా బాగుంది కానీ ఈ సినిమా టైంలో Prabhas ప్రభాస్ ‘రాజాసాబ్’ కోసం పనిచేస్తున్నాడని ఆ టైంలో చాలా బక్కగా కనిపించాడని అన్నాడు మంచు విష్ణు.

Manchu Vishnu : మంచు విష్ణు సెల్ఫ్ డబ్బా..

నేనేమో కండలు పెంచి ఉండగా నన్ను చూసి Prabhas ప్రభాస్ షాక్ అయ్యాడని.. విష్ణు చాలా బాగున్నావ్ అన్నాడని చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు సెల్ఫ్ డబ్బాలో భాగంగానే ఇలా ప్రభాస్ తన ఫిజిక్ చూసి మెచ్చుకున్నాడు అన్నట్టుగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నాడు. ప్రభాస్​తో మంచు విష్ణు స్నేహం మంచిదే కానీ అతని గురించి తక్కువగా మాట్లాడొద్దని అంటున్నారు.

మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఐతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. శివుడిగా అక్షయ్ కుమార్ నటించారు. మరి ఈ విజువల్ ట్రీట్ ఆడియన్స్​ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. రెబల్ స్టార్ ఫ్యాన్స్(Rebel Star Fans) అయితే ప్రభాస్ కోసం అయినా కన్నప్ప ఒకసారి చూడాలని అనుకుంటున్నారు.

Advertisement