అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalyana Laxmi | అధికారంలోకి రావడానికి కాంగ్రెస్(Congress) ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో అనేక హామీలు అమలు చేడయం లేదు. అయితే ఇందులో కల్యాణలక్ష్మి(Kalyana Laxmi) పథకంలో భాగంగా తులం బంగారం(Gold) హామీ అమలు చేయలేమని ప్రభుత్వం ప్రకటించింది.
శాసనమండలిలో సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavithaa) మాట్లాడుతూ.. మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్ష చెక్కుతో పాటు, తులం బంగారం ఇస్తారా అని ప్రశ్నించగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందిస్తూ సాధ్యం కాదని చెప్పారు. అలాగే మహిళలు ఇతర ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా మోసం చేస్తారా అని అడగ్గా ఆ ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.