అక్షరటుడే, వెబ్‌డెస్క్ AI Technology : సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందుతుందంటే ఏంటో అనుకున్నాం కానీ దాని వల్ల అన్ని రంగాల్లో ఇంత చైతన్యం వస్తుంది.. ఇంత మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో AI చేస్తున్న అద్భుతాలు చూస్తే బాబోయ్ అనిపించక తప్పదు. ఇదివరకు సినిమాల్లో హీరోలకు డూప్‌లు ఉండేవారు.. ఈమధ్య అది కాస్త బాడీ డబుల్ చేశారు. ఇక ఇప్పుడు వాళ్లతో కూడా అవసరం లేకుండా ఏఐని వాడేస్తున్నారు మేకర్స్.
రీసెంట్గా ఒక స్టార్ సినిమాలో కొన్ని సీన్స్ AI ద్వారా చేశారట. ఆ హీరో అందుబాటులో లేకపోవడం వల్ల చేసిన ఆ సీన్స్ హీరోనే డిటో దించేశాయని తెలుస్తోంది. ఆ అవుట్ చూసి టీం అంతా కూడా షాక్ అయ్యారట. ఇదే రకంగా చేస్తే హీరోలు లేకుండానే సినిమాలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. హీరోకి ఇమేజ్ రైట్స్ ఇచ్చేసి వాళ్లతో ఎలాంటి సినిమా అయినా చేసేలా ఏఐ వచ్చేసింది.
AI Technology : ఎంత ఉపయోగం ఉందో అంతే రిస్క్ కూడా..
ఐతే దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే రిస్క్ కూడా ఉంది. అందుకే ఏఐని కొన్నిటికి మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఏఐ వాడినా రియల్ ఎమోషన్‌ను ఏది మ్యాచ్ చేయలేదు. కాబట్టి ఏఐ ఎంత విజృంభించినా సినిమా హీరోల బదులు అది వాడడం అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు చాలామంది. ఐతే ఈ విషయంలో దర్శక నిర్మాతల ఆలోచన కూడా ఇదే అని తెలుస్తోంది.
హీరోను ఏఐతో చేస్తే మిగతా పాత్రలను కూడా ఏఐతో ఈజీగా మ్యాచ్ చేయొచ్చు. సో అప్పుడు సినిమా అంతా కూడా కంప్యూటర్లోనే చేయొచ్చు. మరి ఈ ఏఐ టెక్నాలజీ ఎప్పుడో ఒకప్పుడు సినిమా వాళ్లకి బిగ్ త్రెట్‌గా మారే అవకాశం ఉందనిపిస్తుంది. దీనిపై స్టార్స్ అభిప్రాయం ఏమంటారనేది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలిసి కంగారు పడుతున్నారు.