America | అమెరికాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

America | అమెరికాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
America | అమెరికాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా(Florida)లో జరిగిన ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రగతిరెడ్డి(35) ఆమె పెద్ద కుమారుడు హార్వీన్​(6), అత్త సునీత(56) మృతి చెందారు. ప్రమాదం సమయంలో కారులో ఉన్న ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Hyderabad | నడుస్తున్న కారులో మంటలు