పసుపు బోర్డు వచ్చినా ధర ఎందుకు తగ్గుతోంది..? : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
పసుపు బోర్డు వచ్చినా ధర ఎందుకు తగ్గుతోంది..? : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: MLA PRASHANTH REDDY | జిల్లాలో పసుపు బోర్డు వచ్చినప్పటికీ రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా పోయిందని.. దీనికి నిదర్శనం ధర తగ్గడమేనని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటు చేశామని.. పసుపునకు మద్దతు ధర రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ బోర్డు ఏర్పాటయ్యాక కూడా రూ.8 వేలు మాత్రమే పలుకుతోందన్నారు.

MLA PRASHANTH REDDY | ఇందూర్​ మార్కెట్ పెద్దది​..

రాష్ట్రంలోనే ఇందూరు పసుపు మార్కెట్​ పెద్దదని.. ఇక్కడికి జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, జగిత్యాల జిలాల్లో జగిత్యాల, కోరుట్ల నిర్మల్ జిల్లా నిర్మల్, ముధోల్, ఖానాపూర్​లకు చెందిన పసుపు రైతులు తమ పంటను తీసుకొస్తారన్నారు. దాదాపు 8 నియోజకవర్గాల పసుపు రైతులు పసుపును నిజామాబాద్ గంజ్​ మార్కెట్​కు తీసుకొచ్చి విక్రయిస్తారన్నారు. ఈ సీజన్ ప్రారంభంలో నిజామాబాద్ మార్కెట్​లో రూ.12వేలు పలికిన ధర ఇప్పుడు రూ. 8 వేలు కూడా రావడం లేదన్నారు. ఇదే పసుపును మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్​కు తీసుకెళ్తే రూ.13వేల నుంచి రూ.14 వేల ధర వస్తోందన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLA Prashanth reddy | ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

MLA PRASHANTH REDDY | సిండికేట్​గా మారి..

నిజామాబాద్​లోని వ్యాపారులు సిండికేట్​గా మారి అధికారుల సహకారం తీసుకొని ధరను తగ్గిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులు ధర తగ్గి నష్టపోతుండటంతో ఈ మధ్యే పసుపు రైతులు రాజకీయాలకతీతంగా రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేశారన్నారు.

MLA PRASHANTH REDDY | మద్దతు ధర దక్కాలి..

వ్యాపారుల సిండికేట్​ కుట్రలను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాంగ్లీలో పసుపునకు పలుకుతున్న ధర నిజామాబాద్ గంజ్​లో కూడా దక్కేలా చూడాలని కోరారు.

MLA PRASHANTH REDDY | ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

కేంద్ర ప్రభుత్వం, పసుపు బోర్డు అధికారులతో మాట్లాడి రూ.15,000 మద్దతు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, మ్యానిఫెస్టోలో క్వింటాలు పసుపు రూ.12వేలకు కొంటామని హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ పసుపు ధర క్వింటాలుకు రూ.9వేలకు పోతే మిగతా రూ. 3వేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

Advertisement