Railways | రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ఇక వారికి నో ఎంట్రీ

Railways | రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ఇక వారికి నో ఎంట్రీ
Railways | రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ఇక వారికి నో ఎంట్రీ
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Railways | రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దేశంలోని పలు రైల్వే స్టేషన్​(Railway Station)లను ఆధునీకరించిన ప్రభుత్వం.. ఆయా స్టేషన్​లలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టనుంది. విమానాశ్రయాల(Airports) తరహా సెక్యూరిటీని పలు రైల్వే స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Railways | యాక్సెస్​ కంట్రోల్​ సిస్టం

ప్రస్తుతం టికెట్​ ఉన్నా.. లేకున్నా అందరిని ప్లాట్​ఫామ్​ మీదకు అనుమతిస్తున్నారు. ఇక నుంచి ఎవరు పడితే వారు వెళ్లే అవకాశం ఉండదు. దేశంలోని 60 రైల్వేస్టేషన్లలో యాక్సెస్​ కంట్రోల్​ సిస్టం(Access control) ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే జనరల్, వెయిటింగ్ టికెట్ ఉన్నవారు స్టేషన్‌లోకి ప్రవేశించలేరు. టికెట్ కన్ఫర్మ్ అయిన వారికే స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. రద్దీని నివారించడం, ప్రయాణికుల భద్రతను పెంచడానికి ఈ విధానం తీసుకు వస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం మెట్రో స్టేషన్లలోకి కూడా టికెట్​ ఉన్నవారినే అనుమతించే వ్యవస్థ ఉంది.

Railways | ప్రధాన నగరాల్లో..

ప్రస్తుతం యాక్సెస్​ కంట్రోల్​ సిస్టంను ఢిల్లీ, చైన్నై, ముంబయి, కోల్​కతా, బెంగళూరు, హైదరాబాద్​లాంటి ప్రధాన నగరాల్లోని 60 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకు రానున్నారు. అత్యంత రద్దీగా ఉండే స్టేషన్​లలో ఈ విధానం తీసుకు వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని రైల్వే శాఖ భావిస్తోంది.

Advertisement