ISRO | చంద్రయాన్‌-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

ISRO | చంద్రయాన్‌-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
ISRO | చంద్రయాన్‌-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ISRO | చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టనున్న చంద్రయాన్‌-5 మిషన్​పై ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-4 లాంచింగ్ కాకముందే తర్వాత ప్రయోగం గురించి ప్రకటించింది. చంద్రయాన్‌-5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. జపాన్ సహకారంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ISRO | చంద్రయాన్-5 మిషన్ విశేషాలేంటంటే..

చంద్రయాన్-5 మిషన్‌ చాలా ప్రత్యేకమైందని ఇస్రో చీఫ్ తెలిపారు. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడం కోసం 2023లో 25 కిలోల ‘ప్రజ్ఞాన్’ రోవర్‌ను పంపామన్నారు. చంద్రయాన్-5 ఏకంగా 250 కిలోల రోవర్‌ను మోసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ మిషన్‌కు సంబంధించి కేంద్రం నుంచి ఆమోదం లభించిందన్నారు.

ISRO | చంద్రయాన్-4 లాంచింగ్ అప్పుడేనా..

చంద్రయాన్-4 మిషన్​ను 2027లో ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రుని నుంచి సేకరించిన నమూనాలను భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ISRo భవిష్యత్తులో గగన్‌యాన్‌ సహా వివిధ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement