అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha | కేబినెట్ విస్తరణపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం అసెంబ్లీ(Assembly) వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ (Cabinet) విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా రేవంత్‌రెడ్డి (Revanth reddy) సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తారో తమకు తెలుసని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. అందరి బాగోతాలు తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ అనడంపై స్పందిస్తూ.. ఫోన్ ట్యాప్ చేసి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని ఆరోపించారు.
Konda Surekha | యాదగిరిగుట్ట బోర్డు
టీటీడీ(TTD) తరహాలో యాదగిరి గుట్ట బోర్డు(Yadagiri Gutta Board) ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందని, యాదగిరిగుట్ట బోర్డు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని మంత్రి వివరించారు.