అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Setupathi | డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్‌కు ఉన్న స్టార్ క్రేజ్ తెలిసిందే. ఐతే ఈమధ్య ఆయన ఏమాత్రం ఫాంలో లేరు. ఒకప్పుడు స్టార్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన పూరీ ఇప్పుడు హిట్టు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుస ఫ్లాపులతో పూరీ సినిమాల మీద ఆడియన్స్ ఫోకస్ కూడా చేయట్లేదు. చివరగా పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో వచ్చాడు.
ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యింది. ఐతే పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉంటుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే లేటెస్ట్గా పూరీ జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడని టాక్ వస్తుంది. విజయ్ సేతుపతి ఏంటి పూరీతో సినిమా ఏమిటని ఆశ్చయపోవచ్చు.
Vijay Setupathi : పూరీ తన అసలైన టాలెంట్
తనని తాను ప్రూవ్ చేసుకునే టైంలో పూరీ తన అసలైన టాలెంట్‌ను చూపిస్తాడు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి కోసం ఒక అదిరిపోయే కథ రాసుకున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో విజయ్ సేతుపతికి ఆ సినిమా కథ బాగా నచ్చేసిందట. తప్పకుండా ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.
మరి పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి ఎలాంటి సినిమాతో వస్తున్నారు. ఈ కాంబో సినిమా ఎలాంటి సినిమా రాబోతుంది. ఈ విషయాలన్నీ త్వరలో తెలుస్తాయి. పూరీ జగన్నాథ్ మాత్రం ఈసారి సినిమా మాత్రం వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. విజయ్ సేతుపతి కూడా తన సినిమాల కమిట్మెంట్లు అన్ని పక్కన పెట్టి పూరీ సినిమా ముందు కానివ్వాలని చూస్తున్నాడట. మరి విజయ్ సేతుపతిని అంత ఎగ్జైట్ అయ్యేలా చేసిన సినిమా ఏదో చూడాలి. విజయ్ సేతుపతి సినిమా అంటే తెలుగు ఆడియన్స్‌లో కూడా సూపర్ ఎగ్జైట్ మెంట్ ఉంది. ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.