PM Modi | న్యూజిలాండ్​ పీఎంతో ప్రధాని మోదీ కీలక చర్చలు

PM Modi | న్యూజిలాండ్​ పీఎంతో ప్రధాని మోదీ కీలక చర్చలు
PM Modi | న్యూజిలాండ్​ పీఎంతో ప్రధాని మోదీ కీలక చర్చలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: PM Modi | భారత్​లో పర్యటిస్తున్న న్యూజిలాండ్​(New Zealand) పీఎం క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధాని మోదీ(PM Modi) సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీకి వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రధానులు చర్చించారు. ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఢిల్లీకి వచ్చిన ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత్​-న్యూజిలాండ్ (India-New Zealand) స్నేహానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన రంగాలపై విస్తృత చర్చలు జరిపామని పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్​ ప్రధాని ఐదు రోజుల పాటు భారత్​లో పర్యటించనున్నారు.

PM Modi | ఉగ్రవాదాన్ని సహించబోం

ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రధాని నరేంద్రమోదీ తేల్చి చెప్పారు. క్రిస్టోఫర్ లక్సన్‌(Christopher Luxon) తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2019లో న్యూజిలాండ్​లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంపై జరిగిన దాడి అయినా.. 2008లో ముంబయిపై దాడి అయినా తమవైఖరి ఒకటే అని స్పష్టంచేశారు. న్యూజిలాండ్‌లో కొందరు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మోదీ ఆ దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Sunita williams | సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ

PM Modi | కీలక ఒప్పందాలు

ఇరు దేశాల ప్రధానుల మధ్య కీలక చర్చలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాలపై వారు చర్చించారు. రక్షణ రంగంలో సహకారాన్ని కొనసాగించే దిశగా ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు(Signs) చేశాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాలని వారు నిర్ణయించారు. ఈ ఒప్పందతో రెండు దేశాలకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు. పాడిపరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని వివరించారు.

Advertisement