Bichkunda | పోలీస్ స్టేషన్​లో చిల్డ్రన్​ పార్క్​.. ఎక్కడో తెలుసా..

Bichkunda | పోలీస్ స్టేషన్​లో చిల్డ్రన్​ పార్క్​.. ఎక్కడో తెలుసా..
Bichkunda | పోలీస్ స్టేషన్​లో చిల్డ్రన్​ పార్క్​.. ఎక్కడో తెలుసా..
Advertisement

అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | పోలీస్ స్టేషన్​లో చిల్డ్రన్ పార్క్​ (children park in police station) ఏమిటీ అనుకుంటున్నారా..? అవును నిజమే..! బిచ్కుంద పోలీస్​స్టేషన్​లో సోమవారం ఎస్పీ రాజేష్​ చంద్ర (Sp Kamareddy Rajesh Chandra) చిల్డ్రన్ పార్క్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు ఆడుకునేందుకు ఈ పార్క్​ ఉపయోగపడుతుందన్నారు. పార్క్​ ఏర్పాటు చేయించిన బిచ్కుంద సీఐ నరేశ్​ను(bichkunda ci jagadam naresh) అభినందించారు.

అనంతరం బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందించారు. జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బిచ్కుంద సీఐ జగడం నరేష్, ఎస్సై సుధాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamsagar | కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలి