Nizamsagar | ప్రయాణికురాలి నుంచి దోపిడీ.. ఇద్దరి రిమాండ్

Nizamsagar | ఆటోలో ప్రయాణికురాలి దోపిడీ.. ఇద్దరి రిమాండ్
Nizamsagar | ఆటోలో ప్రయాణికురాలి దోపిడీ.. ఇద్దరి రిమాండ్
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar | ఆటోలో ప్రయాణికురాలిని బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు బాన్సువాడ(Bansuwada Rural Ci) రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. ఈనెల 15న మేదరి భూమవ్వ అనే మహిళ అచ్చంపేటలోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు నిజాంసాగర్(Nizamsagar bustand) బస్టాండ్ లో వేచి ఉండగా, ఆటోలో వచ్చిన ఇద్దరు బస్టాండ్ ముందు ఆపారు.

దీంతో భూమవ్వ ఈ ఆటో అచ్చంపేట వెళ్తుందా.. అని అడుగగా, ఆటో డ్రైవర్ అవునని చెప్పాడు. డ్రైవర్ సుందర్ రాజు, ఆటోలోని మరో మహిళ వడ్డే లక్ష్మి కలిసి ఆమెను ఆటోలో ఎక్కించుకున్నారు. బాచేపల్లి శివారులోకి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, వెండి కడియాలు లాక్కుని బాధితురాలిని అక్కడే వదిలి పారిపోయారు. దీంతో బాధిత మహిళ నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Holi | పండుగ పూట యథేచ్ఛగా బంగ్​ విక్రయం

ఇందులో భాగంగా సోమవారం వాహన తనిఖీలు చేపడుతుండగా, ఆటోతో పారిపోతున్న డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం ఒప్పుకోవడంతో సోమవారం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై శివకుమార్, శ్యామ్, మహేష్ బృందాన్ని సీఐ అభినందించారు.

Advertisement