Health Tips : మీరు ఈ 7 ఆహార పదార్థాలను తీసుకుంటే.. శరీరంలో విష పదార్థాలు,వ్యర్ధాలన్నీ మటుమాయం..?

Health Tips : మీరు ఈ 7 ఆహార పదార్థాలను తీసుకుంటే.. శరీరంలో విష పదార్థాలు,వ్యర్ధాలన్నీ మటుమాయం..?
Health Tips : మీరు ఈ 7 ఆహార పదార్థాలను తీసుకుంటే.. శరీరంలో విష పదార్థాలు,వ్యర్ధాలన్నీ మటుమాయం..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Health Tips : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదం నిపుణులు కొన్ని సలహాలు, సూచనలను మనకు తెలియజేస్తున్నారు. శరీరంలో విషాలు, వ్యర్ధాలు తొలగించాలంటే… ఏడు ఆహార పదార్థాలను తప్పనిసరిగా తినాలని నిపుణులు తెలియజేస్తున్నారు… ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తింటే ఎవరైనా సరే ఎక్కువ కాలం జీవించగలరు.ఆ వ్యక్తి ఎప్పటి వరకు జీవించగలరు అనేది, తన జీవనశైలి పై ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏడు రకాల ఆహారాలని మనం తీసుకున్నట్లయితే, శరీరంలో చేరిన విషాలని, వ్యర్థాలను బయటకు పంపి, అనేక‌ వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుడతాయి ఈ ఆహార పదార్థాలు.

ఇప్పుడు మనం తినే కూరగాయలతో సహా పురుగులు మందులు, రసాయనాలతోటి పండిస్తున్నారు. ఇలాంటి రసాయనాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో విషాలు చేరిపోతాయి. వీటిని తొలగించాలంటే మరలా కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తినాల్సిన అవసరం వస్తుంది. ఆ ఏడు ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తేనె : ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తేనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణాశయాంతర పేగుల ఆరోగ్యాన్ని కాపాడుటకు ఇది ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ తేనే గొంతుకి కూడా ఎంతో మేలు చేయగలదు. ఈ తేనెలో యాంటీ యాంగ్జైటీగా చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడగలదు. కాబట్టి, ఈరోజు ఒక స్పూన్ తేనె తీసుకుంటే శరీరంలో పేర్కొన్న అనవసర వ్యర్ధవాలు బయటికి పంపవేయబడతాయి. అలా అని తేనెను అతిగా కూడా తినకూడదు. లిమిట్లో తీసుకోవాలి. రోజుకి ఒక్క స్పూన్ మాత్రమే. ఇది పరిగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నెయ్యి : ఎవరింట్లో అయినా సరే నెయ్యి లేకుండా ఉండదు. నెయ్యి మంచి కొవ్వులను కలిగి ఉంటుంది. ఈ నెయ్యి చర్మ ఆరోగ్యానికి, జిర్ణ క్రియకు, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా కలిగి ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వారికి నెయ్యి మంచి ఆహారం. మీ శరీరంలో ఏవైనా విషాలు ఉన్నా, వ్యర్ధాలు ఉన్నా, బయటికి పంపేందుకు నెయ్యి ఎంతో సహకరిస్తుంది. అయితే, ప్రతి రోజు నెయ్యిని ఒక స్పూన్ తిని అలవాటు చేసుకోండి.

రాతి ఉప్పు : హిమాలయన్ సాల్ట్ లేదా రాతి ఉప్పు అంటారు. ఈ సాల్ట్ ఆరోగ్యానికి మంచిది. ఈ ఉప్పు ప్రాసెస్ చెయ్యని ఉప్పు రకాలు. ప్రతిరోజు వాడే టేబుల్ సాల్ట్ కు బదులు, ఈ రాతి ఉప్పుని వినియోగిస్తే మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ ఉప్పును ఉపయోగిస్తే ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది. శరీరానికి,జీర్ణక్రియకు బలాన్ని అందిస్తుంది. రక్తంలో ఎలాంటి విష పదార్థాలు, వ్యర్ధాలు ఉన్న బయటకు పంపి వేస్తుంది.

వెన్న : మజ్జిగ ను చిలకరించడం వల్ల వెన్నె వస్తుంది.ఈ వెన్నును ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వెన్నును పరాటాలలో వేసుకొని తింటూ ఉంటారు. ఈ వెన్నెను కరిగించగా నెయ్యి వస్తుంది. ఎంతో రుచిగా, సువాసనను కలిగి ఉంటుంది. ఈ వెన్నెను ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి మంచిది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం పోషకాలను శోషించుకునేలా చేయగలదు. శరీరంలో విష, వ్యర్థ పదార్థాలను, మూత్రపిండాల ద్వారా బయటికి పంపి వేయవచ్చు.

పిప్పలి : వేద శాస్త్రంలో పిప్పలిని మూలికగా కూడా వాడతారు. మిరియాలు లాగా ఉండే పొడవాటి ఒక రకమైన మిరియాలు. వీటినీ తింటే దగ్గు నియంత్రణలోకి వస్తుంది. శ్లేషం కూడా ఏర్పడదు. శ్వాస మార్గాలు శుభ్రంగా ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతిరోజు పిప్పలిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు రావు. శరీరంలోని విషాలు,వ్యర్ధాలు తొలగిపోతాయి.

నల్ల మిరియాలు : మిరియాలను వాడేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రతి కూరలో కూడా మిరియాల పొడిని వినియోగిస్తే మంచిది. దీన్ని ఉపయోగించడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా మన శరీరానికి అందుతాయి. యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా రక్తంలో చక్కెరలను పెరగకుండా అడ్డుకోగలదు. శరీరంలో కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తుంది. క్యాన్సర్ తో పోరాడగలిగే శక్తి కూడా ఈ నల్ల మిరియాలకు ఉంది. ప్రతిరోజు మిర్యాల పొడిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మంచి ఆరోగ్యం మీ సొంతం. తక్కువ మోతాదులో తీసుకోవాలి.

శొంఠి : ఈ సొంటిని అల్లం ను ఎండబెట్టగా , ఎండిన తర్వాత అల్లం పొడిని శోంఠి అంటారు. ఇందులో శోథ నిరోధక లక్షణాలు ఎక్కువ. దీంతో దగ్గు, జలుబు నుంచి మనల్ని రక్షిస్తుంది. కీళ్ళ నొప్పులను కూడా తగ్గించగలదు. వెచ్చని నీటిలో చిటికెడు శోంఠి పొడి వేసుకొని కలుపుకొని తాగితే ఎంతో ఆరోగ్యం. శరీరంలో మలినాలు,విషాలు తొలగిపోతాయి.

Advertisement