అక్షరటుడే, ఇందూరు: Volunteers : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వ్యసనాల నివారణకు వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. ఏ. విశాల్ తెలిపారు. ఆల్కహాల్, డ్రగ్ డీఅడిక్షన్ & రిహాబిలిటేషన్ సెంటర్(Alcohol, Drug Deaddiction & Rehabilitation Center) ఆధ్వర్యంలో వ్యసనాల నివారణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పనిచేయడానికి ఆసక్తిగల వాలంటీర్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
Volunteers : కార్యక్రమ లక్ష్యాలు..
ఎంపికైన వాలంటీర్లు ప్రధానంగా పలు వ్యసనాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఆల్కహాల్, డ్రగ్ డీఅడిక్షన్ & రిహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో వీరు పనిచేయాలి. వాలంటీర్లు పలు వ్యసనాల నివారణకు పాటుపడాలి.
- మద్య వ్యసనం – Alcohol, కల్తీ కల్లు, గుడుంబా, గుల్పారం కల్లు(Alcohol addiction – Alcohol, adulterated toffee, Gudumba, Gulparam toffee)
- పొగ తాగే పదార్థాలు – సిగరెట్లు, బీడీ, గుట్కా, పొగాకు నమలడం(Smoking substances – Cigarettes, Biddi, Gutka, chewing tobacco)
- గంజాయి (Cannabis) వ్యసనం
- కొకైన్ & అంపెటమైన్ మత్తు పదార్థాల దుర్వినియోగం (Cocaine & Amphetamine drug abuse)
- ఓపిఎం & హెరాయిన్ వ్యసనం(OPM & Heroin addiction)
- హాలుసినోజెన్స్ & ఇంహేలెంట్స్ దుర్వినియోగం (Hallucinogens & Inhalants abuse)
- ఆన్లైన్ బెట్టింగ్(Online betting)
Volunteers : ఉచిత శిక్షణ ఇచ్చి..
వ్యసనాలపై అవగాహన, నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తల గురించి రెండు రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తారు. ఇందుకు కేవలం 30 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.
Volunteers : అర్హత, నమోదు ఇలా..
- నిజామాబాద్ & కామారెడ్డి జిల్లాల నుంచి సామాజిక సేవలో ఆసక్తి ఉన్నవారికి అవకాశం.
- కేవలం 30 మందికి మాత్రమే ప్రవేశం.
- ఆసక్తి గలవారు 99081 20261 నంబరును సంప్రదించి ఎన్రోల్ చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 30, 2025.