అక్షరటుడే, సిరికొండ : CP SAI CHITANYA | గంజాయి నిర్మూలనలో భాగంగా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని సీపీ సాయి చైతన్య ips sai Chaitanya పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం సిరికొండ పోలీస్ స్టషన్(Sirikonda police station)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా గంజాయికి బానిసలైతే వారికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు.
CP SAI CHITANYA | హెల్మెట్‌పై అవగాహన కల్పించాలి..
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ(cp nizamabad) సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనదారులను రోడ్లపైకి అనుమతించవద్దని ఆదేశించారు. సైబర్ నేరగాళ్లు, గేమింగ్ యాప్‌ల బారిన పడకుండా యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ధర్పల్లి సీఐ భిక్షపతి dharpalli insoector bikshapathi, సిరికొండ ఎస్సై రాములు sirikonda si ramulu తదితరులున్నారు.