PM CM | పీఎం మోదీకి సీఎం రేవంత్​ కీలక లేఖ

PM CM | పీఎం మోదీకి సీఎం రేవంత్​ కీలక లేఖ
PM CM | పీఎం మోదీకి సీఎం రేవంత్​ కీలక లేఖ
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: PM CM : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వెనుకబడిన తరగతులకు విద్య(education), ఉద్యోగ రంగాల(employment sectors)తో పాటు స్థానిక సంస్థ(local bodies)ల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి శాసనసభ రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి లేఖలో ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ కోరారు.

PM CM : అఖిల పక్ష నేతలో వస్తాం..

తెలంగాణ శాసనసభ(Telangana Legislative Assembly)లో ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్(Congress), భారాస(BRS), భాజపా(BJP), ఏఐ ఎంఐఎం(AI MIM), సీపీఐ(CPI) నాయకుల బృందంతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. బిల్లులపై చర్చ సందర్భంగా 50% రిజర్వేషన్లు మించొద్దనే నిబంధన ఉందని, దానిపై పార్లమెంటులో రాజ్యాంగ సవరణ(constitutional amendment) అవసరమని సీఎం రేవంత్​ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రధానమంత్రి ని కలుద్దామని కోరగా.. అన్ని పార్టీల సభ్యులు అంగీకరించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  ABVP Nizamabad | బడ్జెట్లో విద్యారంగానికి నిధులివ్వాలి

PM CM : రాహుల్​ను​ కూడా..

ఈ నేపథ్యంలో ఆ రెండు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి లేఖలో విన్నవించారు. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్​కు సీఎం రేవంత్​ విజ్ఞప్తి చేశారు. పీఎంతోపాటు పార్లమెంటులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలుద్దామని సీఎం చెప్పారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నించాలని సూచించారు.

Advertisement