అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heroine | హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarval) తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమా హిట్‌తో ఆడియెన్స్ మంచి క్రేజ్ సంపాదిందించి. అయితే తన అందం, నటనతో కట్టిపడేసే ఈ భామ తాజాగా ఓ కేసులో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Heroine | బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి..
నిధి అగర్వాల్ గతంలో ఓ బెట్టింగ్ యాప్(Betting app)ను ప్రమోట్ చేసింది. జీత్ విన్ అనే యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన 11 మందిపై తెలంగాణ పోలీసులు(Telangana Police) సోమవారం కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో హీరోయిన్ గత వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు ఆమెపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Heroine | భారీ సినిమాల్లో అవకాశం
నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు భారీ సినిమాల్లో నటిస్తోంది. పవన్ కల్యాణ్(Pavan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీలో ఈ భామ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రూపొందుతున్న రాజాసాబ్ చిత్రంలో కూడా ఈ హీరోయిన్ మెరవనుంది. అయితే హీరోయిన్గా రాణిస్తున్న ఈమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఈమెపై తెలంగాణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.!