Assembly sessions | ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

Assembly sessions | ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
Assembly sessions | ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై సభలో చర్చ చేపట్టిన అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్(speeker Gaddam prasad) ప్రకటించారు.

Assembly sessions | దళితులకు కాంగ్రెస్​ అండ

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్​ రెడ్డి(Revanth Reddy) మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ దళితులకు అండగా ఉంటోందని తెలిపారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను సీఎంగా చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Highest Temperature | భానుడి భగభగలు షురూ..

Assembly sessions | సుప్రీం తీర్పు వచ్చిన గంటలోపే..

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే తాము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని సీఎం రేవంత్​ తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ నియమించామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement