అక్షరటుడే, వెబ్‌డెస్క్: Promotions | రాష్ట్రంలోని పలువురు డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా(dsp promotion as ASP) పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సెక్రెటరీ రవిగుప్తా(ravi guptha) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ కమిషనరేట్లు, జిల్లాలు, విభాగాల్లో పనిచేస్తున్న 15 మంది డీఎస్పీలకు నాన్ క్యాడర్ ఏఎస్పీలుగా(asp promotions) అడ్‌హక్ ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరిందరిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అతి త్వరలోనే వీరికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
Promotions | పదోన్నతి పొందినవారు వీరే..
టీఎంఎన్ బాబ్జి(ఏసీపీ షీటీమ్స్, రాచకొండ), కె.శ్రీకాంత్ (డీఎస్పీ వీఅండ్ఈ), ఎస్.శ్రీనివాస్ రావు(ఏసీపీ ఎస్బీ, నిజామాబాద్), సి.కుషాల్కర్(ఏసీపీ మహేశ్వరం, ట్రాఫిక్), జి.నరేందర్(ఏసీపీ టాస్క్‌ఫోర్స్, కరీంనగర్), పి.వెంకట్ రమణ(ఏసీపీ ఎస్ఆర్ నగర్), ఎస్.చంద్రకాంత్(ఏసీపీ, సీసీఎస్, సైబరాబాద్), వి.రఘు(ఏసీపీ కాచిగూడ), పూర్ణచందర్(ఏసీపీ సచివాలయం), జి.హన్మంత్‌రావు(ఏసీపీ బాలనగర్), కె.శ్రీనివాస్‌రావు(ఏసీపీ, శంషాబాద్), జి.రమేశ్(డీఎస్పీ ఎస్బీ, నల్గొండ), ఎన్.సుదర్శన్(డీఎస్పీ, జీహెచ్ఎంసీ), ఎన్.ఉదయ్‌రెడ్డి(డీఎస్పీ, ఏసీబీ), ఎన్.శ్యాంప్రసాద్‌రావు(డీఎస్పీ, సీఐడీ).