Aadhaar Voter ID | మరోసారి తెరపైకి ఓటరు ఐడీకి ఆధార్​ అనుసంధానం

Aadhaar Voter ID | మరోసారి తెరపైకి ఓటరు ఐడీకి ఆధార్​ అనుసంధానం
Aadhaar Voter ID | మరోసారి తెరపైకి ఓటరు ఐడీకి ఆధార్​ అనుసంధానం
Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: Aadhaar Voter ID | ఓటరు ఐడీకి ఆధార్ (Linking Aadhaar with Voter ID) సంఖ్య అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. ఓటర్ల జాబితాలో తారుమారు జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Aadhaar Voter ID | అత్యున్నత స్థాయి సమావేశం

ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఆధార్ సంఖ్యతో ఓటరు ఐడీ అనుసంధాన ప్రక్రియకు కేంద్రం ఎన్నికల సంఘం(Central Election Commission) అడుగులు వేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్​లో భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar), ఈసీలు డాక్టర్ సుఖ్బర్​ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, యూఐడీఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణులు సమావేశమయ్యారు.

Aadhaar Voter ID | పలు కీలక నిర్ణయాలు

ఈ భేటీలో అర్హులైన వారందరికీ ఓటర్లుగా నమోదు చేసుకోనే అవకాశం కల్పించడంతో పాటు నకిలీ ఐడీ కార్డులను తొలగించడం వంటి అంశాలపై చర్చించారు. ఇందు కోసం ఓటరు ఐడీని ఆధార్​తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Adhaar Link | త్వరలో ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం

Aadhaar Voter ID | అన్ని అంశాలు పరిగణనలోకి..

ఈపీఐసీని ఆధార్​తో అనుసంధానం చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని 23(4), 23(5), 23(6) నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ నిర్ణయంతో త్వరలో యూఐడీఏఐ, ఈసీఐ నిపుణుల మధ్య సాంకేతిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

Aadhaar Voter ID | పదేళ్ల క్రితం మొదటిసారి

ఎన్నికల జాబితాలో నకిలీ ఎంట్రీలను పరిష్కరించడానికి జాతీయ ఎన్నికల రోల్స్ ప్యూరిఫికేషన్, ప్రామాణీకరణ కార్యక్రమాన్ని(NERPAP) ఫిబ్రవరి 2015లో ప్రారంభించింది. నాడే ఆధార్-ఓటరు ID అనుసంధానానికి ECI ప్రయత్నించింది. మూడు నెలల వ్యవధిలో 300 మిలియన్లకు పైగా ఓటర్ల ఆధార్​ ఓటరు ఐడీని లింక్ చేసింది. కానీ, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది.

Advertisement